గొదావరి పుష్కర స్నానమాచరించిన ప్రముఖులు
పలువురు ప్రముఖులు గోదావరి పుష్కర స్నానమాచరించారు. రాజమండ్రి వద్ద గోష్పాదక్షేత్రం వద్ద కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామిజీ పుష్కర స్నానమాచరించి పుష్కరాలను ఆరంభించారు. అక్కడ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద చిన జియ్యర్ స్వామిజీ పుష్కరాలకు అంకురార్పణ చేశారు. మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాజరయ్యారు. బాల్కొండ మండలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద గల గోదావరి నదిలో మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పుష్కరాలను ఆరంభించారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వరంగల్ జిల్లా మంగంపేటలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, బాసర అమ్మవారి సన్నిధిలో తెలంగాణ మంత్రి జోగు రామన్న, యానాంలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి గౌతమి గోదావరిలో స్నానమాచరించి పుష్కరాలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి విఐపీ ఘాట్ వద్ద ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి పుష్కర స్నానమాచరించారు. రాజమండ్రిలో ఏపీ మంత్రులు దేవినేమి ఉమ, పల్లె రఘునాథరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పుష్కర స్నానమాచరించారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








